Posts

Showing posts from May, 2019

తెనాలి రామక్రిష్ణ - శ్రీ కృష్ణదేవరాయుల కల

Image
శ్రీ కృష్ణదేవరాయుల కల 500 సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీ కృష్ణదేవరాయులు పరిపాలించేవారు. ఆయిన ఒక రోజు నిద్రలొ ఒక కల కన్నారు. ఆ కలలో ఆయినకొక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకశంలో తేలుతూ, లక్ష దీపాలతో చాలా అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మొన్నాడు సభలో ఆయిన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయిన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపేరు. అది విన్న వారంత అలాంటి భవనమును ఎలా కట్టగలము – అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని – “అదంతా నాకు అనవసరం. మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తాను – లేదా మీరందరు నాకు కనిపించకండి” అని ఆఙాపించారు. విన్నవారంత నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మరువలేదు. ఒక రోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్ర తో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయులవారి ని ప్రార్థ...

విక్రమార్కుడు-బేతాళుడు కథలు

Image
విక్రమార్కుడు-బేతాళుడు కథలు చిన్నప్పుడు చందమామలో ఎంతో ఇష్టంగా చదివే వాళ్లము. దూరదర్శన్ వారు కూడా ఈ కథలును సీరియల్ గా చూపించేవారు. వారమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ, ఆ టైములో కరెంటు పోకూడదని గట్టిగా ప్రార్థిస్తూ వేచి చూసే వాళ్లము. ఇప్పుడు 100 చానెల్స్, వెయ్యి సీరియల్స్ చూసే జనరేషన్కి ఆ innocent pleasure అస్సలు అర్ధం కాకపోవచ్చు. కానీ ఈ కథలు ఉత్తి వినోదం కోసమే రాసినవి కాదు. ఈ చిన్న కథలలో పెద్ద నీతులు దాగి వుంటాయి. భారతీయ సంస్కృతిలో పురాణ కథలలో వినోదంతో పాటు విద్యా, విజ్ఞానం కూడా వెదజల్లడం మామూలు విషయం. అందుకే “వెన్నతో పెట్టిన విద్య” అనే పదానికి అంత లోతైన అంతరార్ధం వుంది. నిన్న చూసిన సినిమా ఇవాళ గుర్తు వుండదు. కానీ ఈ కథలు? ఎన్నో యుగాలుగా గుర్తుండి పోయినవి. విక్రం-బేతాళ్ కధలు దాదాపు 2500 సమత్సరాల క్రిందట మహాకవి సోమదేవ్ భట్ట సంస్కృతంలో వ్రాసిని “బేతాల్ పచ్చీసి” పై ఆధారించబడినవి. పచ్చీసీ అన్న పేరుబట్టి మొదటిలో ఇవి 25 కథల ద్వారా తెలియచేసిన నీతులని నమ్ముతారు. చందమామ magazine వల్ల popular culture లో చోటు చేసుకుని, చాలా భాషలలోకి అనువదించబడ్డాయి. విక్రమార్కుడు, బేతాళుడు ముఖ్య పాత్రల ఆధార...

విక్రమార్కుడు-బేతాళుడు - మారిన రూపాలు (6)

Image
మారిన రూపాలు :- పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, అర్ధరాత్రి సమయంలో, నీ మందిరంలో పట్టుపాన్పుపై నిశ్చింతగా నిద్రపోవలసిన నువ్వు, ఇంత భీతగోల్పే శ్మశానంలో, నానా ఇక్కట్లకూ లోనవుతూండడం చూస్తుంటే జాలి కలుగుతున్నది. ఎంతటి వివేకవంతులూ, ఒక్కొక్కసారి తమ వ్యక్తిగతమైన అతి ముఖ్య విషయాల గురించి, వివేకహీనుల్లా నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి వాటికి కారణాలు వేదికిపెట్టడం సాధ్యపడే పని కాదనుకుంటాను! ఇందుకు ఉదాహరణగా, తనను ప్రాణప్రదంగా ప్రేమించిన ఒక యువతి పట్ల, మాళవదేశ యువరాజు ప్రవర్తించిన తీరు యెంత అసందర్భంగా, అవివేకంగా ఉన్నదో చెబుతాను, శ్రమ తెలియకుండా వినే.” అంటూ ఇలా చెప్పా సాగాడు: మాళవ దేశాన్ని పాలించే వీరసిమ్హుడు వ్రుద్దుడైపోయాడు. ఆయన ఏకైక పుత్రుడు సూర్యవర్మ. సూర్యవర్మ యుక్తవయస్కుదయ్యాడు. కుమారుడికి త్వరలో వివాహం జరిపి, పట్టాభిషేకం చేస్తే తన బాధ్యతా తీరిపోతుందని భావించాడు మాహారాజు. యువరాజు వివాహ విషయంలో తగిన కన్య కోసం అన్వేషణ జరపవలసిన అవసరం కూడా లేద...

విక్రమార్కుడు-బేతాళుడు - గురుదక్షిణ – మాతృదక్షిణ (5)

Image
గురుదక్షిణ – మాతృదక్షిణ  :- పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, అర్ధరాత్రి వేళ, భీతగొలిపే ఈ స్మశానంలో, తల పెట్టిన కార్యం సాధించేందుకు, దృఢ సంకల్పంతో నువ్వు చేస్తున్న ధైర్య సాహసాలు మేచ్చుదగినవే. అయితే వాటితో పాటు మనిషికి లోకజ్ఞత, సమయస్ఫూర్తి, లక్ష్య శుద్ధి ఎంతో అవసరం. అవి లేనివాడు కార్యం సిద్ధించే తరుణంలో దాన్ని చేజేతులా జారవిడవడం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణంగా సునందుడనే వాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను” అంటూ ఇలా చెప్ప సాగాడు: – పూర్వం విరూపదేశానికి బృహస్పతి లాంటి బుద్ధిశాలి అయిన మంత్రి వుండే వాడు. మహారాజు శూరసేనుడు ప్రతి విషయానికి మంత్రి మీదనే ఆధార పడేవాడు. ఆయన పాలనలో దేశం సుభిక్షంగా వుంది. దురదృష్టవశాత్తు మహామంత్రి అకాల మరణానికి గురయ్యాడు. శూరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకుని, ఆయన సలహాలతో రాజ్య పాలన చేయ సాగాడు. కొత్త మంత్రికి రాజును మెప్పించడం బాగా తెలుసు కానీ, సలహాలివ్వడం బొత్తిగా చేత కాదు. అయినా తనకు తోచిన సలహాలిస్తూంటే రాజ్...

విక్రమార్కుడు-బేతాళుడు - వీణాధరి నిర్ణయం(4)

Image
వీణాధరి నిర్ణయం :- పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న పట్టుదలతో, అర్ధరాత్రి వేల ఈ స్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే, నాకు నిన్ను గురించి ఒక శంక కలుగుతున్నది. అదేమంటే – అసలు నువ్వు సాధించదలచిన కార్యం ఏమిటి? అది నీ శక్తి సామర్థ్యాలకు, ప్రతిభకు, కీర్తి ప్రతిష్ఠలు తెచ్చేదా? లేక నలుగురిలో నిన్ను అవమానమూ, అపహాస్యాలపాలు చేసేదా? ఎందుకంటే, ఎవరూ తమ స్థాయికి మించిన పనులకు పూసుకోరాదని అనుభవజ్ఞులు చెబుతుంటారు. వారి మాటల్లోని వాస్తవాన్ని నిరూపించేందుకు ఉదాహరణగా, వీనాధరి అనే ఒక యువతి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,” అంటూ ఇలా చెప్పా సాగాడు. చంద్రశిలా రాజ్యలో రాజయ్యా అనే పేదరైతు ఉండేవాడు. అతడి భార్య కామాక్షి. వాళ్లకు చాలా కాలం గడిచేక, ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ శిశువును చూసి అందరూ అద్భుతం చెందారు. ఆ శిశువు కనుముక్కు తీరుతోపాటు శరీరం మేలిని బంగారంతో తులతూగేలా వుంది. అటువంటి అందాలరాశి తన కుమార్తె అయినందుకు రాజయ్య సంతోషించ...

విక్రమార్కుడు-బేతాళుడు - సత్యపాలుడి కథ (3)

Image
సత్యపాలుడి కథ  :- పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు,”రాజా, ఈ రాత్రి వేళ భీతిగొలిపే శ్మశానంలో నువ్వు ప్రదర్శిస్తున్న పట్టుదలా, శ్రమకు ఓర్చుకోగల శక్తి చూస్తుంటే, నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. దేశ పాలకులైన రాజుల్లో ఇలాంటి గుణగణాలు సర్వ సాధారణం కాకపోయినా, అపూర్వం మాత్రం కాదు. దేశాన్ని సమర్థవంతంగ పాలించి, ప్రశాంత వాతావరణంలో దాన్ని వారసుల వరం చేయాలంటే, అందుకు కేవలం పట్టుదల, ధైర్య సాహసాలు మాత్రమే సరిపోవు, ఏంతో నిలకడ గల రాజనీతి, చతురత అవసరం. రాజుకు కావలసిన అన్ని మంచి లక్షణాలు వుండి, నిలకడగల రాజనీతి, చతురత్వం లోపించిన సత్యపాలుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను.” అంటూ ఇలా చెప్ప సాగాడు. పూర్వం చందన దేశాన్ని పాలించే చంద్రపాలుడు హఠాత్తుగా మరణించడంతో ఆయన ఏకైక పుత్రుడు సత్యపాలుడు రాజయ్యాడు. రాజైన కొద్ది రోజుల్లోనే, అతడు దేశపు యదార్ధ స్థితిగతుల్ని గమనించి ఖిన్నుడయ్యాడు. భోగ లాలసుదిన చంద్రపాలుడు, పరిపాలన చాలా వరకు ఉన్నతాధికారులు చేతుల్లో వదిలేసి, విలాస జీవితం సాగించ...